ఘనంగా అరుబోలు బాలు పుట్టినరోజు వేడుకలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన నిస్వార్ధ జనసేన పార్టీ నాయకుడు, ఆ గ్రామంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చిన అరుబోలు బాలు పుట్టినరోజు సందర్బంగా గురువారం జనసేన పార్టీ కార్యాలయం నందు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, బాలు కోసం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కో కన్వీనర్ ముక్క రాంబాబు, మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొన్నారు.