జనసేన-గిరిసేన, జనం వద్దకు జనసేన 41 వ రోజు కార్యక్రమం

పాలకొండ: జనం వద్దకు జనసేన 41 వ రోజు కార్యక్రమంలో భాగంగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామ రైతులు, మరియు కౌలు రైతులతో, పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ, వజ్రగడ రవికుమార్ సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్బంగా బొడ్లపాడు గ్రామ రైతులతో మాట్లాడుతూ కడుపు నింపే రైతన్నలకు కన్నీరు రాకూడదని, లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చే కౌలు రైతుల ఆత్మహత్యలు లేని సమాజం తీసుకురావాలన్న తపనతో ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని తెలియజేస్తూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర మాత్రం ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ ఓట్లు కోసం నాయుకులు వచ్చినప్పుడు మాత్రం మేము మీకు సేవకులం అని చెప్పిన నాయకులు రాజుల్లా బ్రతుకుతున్నారు. కానీ రైతులు మాత్రం కూలీలుగానే ఉండిపోతున్నారు. ఈ పద్ధతి మారాలి అప్పుల పాలైన రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయిలు చొప్పున 30 కోట్ల రూపాయిలు తన సొంత కష్టార్జితం పంచి పెట్టిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే చెందుతుంది. పైగా మరణించిన రైతు పిల్లలను చదివించే బాధ్యత పవన్ కళ్యాణ్ నే తీసుకున్నారు. అలాంటి గొప్ప నాయుకుడికి అధికారం అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్యలు ఖచ్చితంగా తీరతాయి అని ఈ సందర్భంగా జనసేన జానీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు రైతులు సాంబినాయుడు, వెంకట్ నాయుడు, సత్యం నాయుడు, వాసునాయుడు, కిక్ నాయుడు, వెంకట్, సూర్యనారాయణ, దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.