ఘనంగా రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి విభాగ అధ్యక్షులు దుంపటి శ్రీనివాస్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డేగల రామచంద్రరావు ఆధ్వర్యంలో ఖమ్మంలోని పెద్ద తండా సమీపంలో ఉన్న మెఫి మానసిక వికలాంగుల కేంద్రంలో ఉన్న పిల్లలకు ఒక వారం రోజులకు సరిపడ ఆహార సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరియు మానసిక వికలాంగులచే కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెఫీ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ రామ్ తాళ్లూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యువజన విభాగం ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మెడబోయిన కార్తీక్, ఉపాధ్యక్షులు యాసంనెని అజయ్ కృష్ణ, సెక్రటరీ గుంత సత్యనారాయణ జనసైనికులు షేక్ మాలిక్, ఉత్తమ్ రాజ్, గోపికృష్ణ, రమణ కుమార్, సాయి గోపి, హరికృష్ణ, శ్రీకాంత్ బాణాల శ్రీకాంత్, వంశీ, రంజిత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.