సాగినీటి సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదని ప్రశ్నించిన గుడివాక శేషుబాబు

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలాలకు సాగునీటి కష్టాలు ఎందుకు పరిష్కారం కావట్లేదని జనసేన పార్టీ అవనిగడ్డ నాయకులు గుడివాక శేషుబాబు ప్రశ్నించారు. అవనిగడ్డలో శేషుబాబు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు సాగునీటి సరఫరాలో విఫలమయ్యారని గతంలో ఉద్యమాలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మూడేళ్లుగా కోడూరు మండలానికి సాగు నీటి సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదని ప్రశ్నించారు. కోడూరు మండలంలో నేటికీ చేలు దమ్ము చేసుకునేందుకు సాగు నీళ్లు అందని గ్రామాలు ఉన్నాయన్నారు. నాగాయలంక మండలంలో వేసిన నాట్లకు తడులకు నీరు అందక ఆయిల్ ఇంజన్లు పెట్టుకోవలసి వస్తోందన్నారు. ఈ సమస్యల నేపథ్యంలో సాగునీటిని అందించటంలో వైసీపీ కూడా విఫలమైందని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ దెబ్బతింటున్నా కనీసం బాగు చేయించలేదన్నారు. ఈ పాలకులు కొత్తవి నిర్మించే సత్తా లేకపోయినా కనీసం బ్రిటిష్ వారు నిర్మించిన ఆక్విడెక్టు అయినా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.