గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీలోకి చేరికలు

అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, గుంతకల్ మండల అధ్యక్షుడు కురుబ పురుషోత్తం సమక్షంలో భారీగా యువకులు, విద్యార్థులు జనసేన పార్టీలో చేరారు వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు, పవర్ శేఖర్, అమీర్ సోహెల్, కృష్ణ, నాయకులు బండి శేఖర్, విజయ్, వీరేష్, పాండు కుమార్, మారుతి, సురేష్, అనిల్ కుమార్, మంజు, దాదు, కసాపురం నందా, మహేష్, ఒబులేశు, రవికుమార్, రాజు, లారెన్స్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.