ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

  • ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్ డిమాండ్

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులను మోసం చేస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్పొరేట్, సెమీ కార్పోరేట్, ప్రవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా, ఫైర్ సర్టిఫికెట్, ఆటస్థలం, మౌలిక వసతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ ఆవరణలో నోటుబుక్స్, స్కూల్ యూనిఫామ్, బుక్స్ అమ్ముతూ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తూ.. మరికొన్ని స్కూల్స్ ఏ విధమైన సీబీఎస్ఈ గుర్తింపు లేకపోయినా సీబీఎస్ఈ గుర్తింపు ఉందని, సీబీఎస్ఈ స్థాయి ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, ఇటువంటి విద్యాసంస్థలను గుర్తించి, వాటిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ – ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి అఖిల్, నాయకులు మహేష్ శివ శ్రీను వెంకట్ తదితరులు పాల్గొన్నారు.