ఆప్తా నూతన అధ్యక్షులను స్వాగతిస్తూ గునుకుల కిషోర్ ర్యాలీ

ఒకసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వండి అంటూ జనసేన పార్టీ నెల్లూరు తరపున ఆప్తా నూతన అధ్యక్షులను స్వాగతిస్తూ జరిగిన ర్యాలీ లో అమెరికాలో సేవా సంస్థ ఆప్త నూతన అధ్యక్షుని స్వాగతిస్తూ జనసేన పార్టీ తరఫున మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు గునుకుల కిషోర్ దాదాపు 500 మంది జనసేన మద్దతుదారులతో కాపు భవన్లో వారి సన్మాన సభకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

  • ఉన్నత భావాలు కలిగి సాటి మనిషికి ఏదో ఒక సహాయం చేయాలి అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించాలని ఒక సంకల్పంతో మొదటి నుంచి ఏదో ఒక విధంగా సమాజ శ్రేయస్సుకు పాడుతుపడుతున్న మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
  • లక్షలాది మంది యువత కలల సాకారానికి శ్రమిస్తున్న సామాజిక వాది, దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అందించిన సేవాతత్పరుడు పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఆప్త సంస్థ దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
  • అమెరికాలోని తెలుగు వారికి సేవలను అందిస్తూ ఐటీ రంగంలో ఉన్నత శిఖరాన్ని అందుకున్న నెల్లూరు వాసి కొట్టే ఉదయ్ భాస్కర్ అప్తా అధ్యక్షులు గా ఎన్నికైన తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారిని కలసి జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ని సీఎం చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈరోజు వారిని సత్కరించారు.
  • రోజా అక్క గో బ్యాక్ టు జబర్దస్త్ కళ్లకు సాక్షి గంతలు కట్టుకున్న మీకు ప్రజలకు పడుతున్న ఇబ్బందులు కనపడుట లేదు.
  • మీ ప్రభుత్వం కాపాడుతున్న సుగాలి ప్రీతి రేప్ కేసుల నిందితుల సాక్షిగా పవన్ కళ్యాణ్ కి మహిళల మద్దతు ఎంత ఉందో అందరికీ తెలుసు.
  • మా పవన్ కళ్యాణ్ కి నిజంగా నీలాంటి నోటి పొగరు ఉండే మహిళలు నచ్చకపోవచ్చు.
  • టూరిజం శాఖ పర్యాటక శాఖలో పూచిక పుల్లంత అభివృద్ధిని సాధించని మీరు రాజకీయానికి అనర్హులు.
  • రేపు నగరి ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో రోజా ఓటమి ఖాయం.
  • రాష్ట్రం రావణ కాష్టంగా ఉంది ఎటు చూసినా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రణాలిక బద్ధంగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే ఒకసారి పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించండి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ గునుకుల కిషోర్ తో కంథర్, ప్రశాంత్ గౌడ్, రాజా, హేమంత్ యాదవ్, అమీన్, షాజహాన్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు