షాడో మేయర్ చేతిలో జీవీఎంసీ

  • కౌన్సిల్ లో అప్రజాస్వామికం
  • జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు

ఆశీలమెట్ట, విశాఖ తూర్పు: మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కార్మికులు సమస్యలు మీద ప్రస్తావించిన సమాధానం ఇవ్వలేదు, బడ్జెట్ సమావేశం మధ్యలో కమిషనర్ వెళ్లిపోవడం ఫై ప్రశ్నించినందుకు జనసేన కార్పొరేటర్ నైన తనను మేయర్ హరి వెంకట కుమారి ఏకపక్ష నిర్ణయం తో సస్పెండ్ చెయ్యడం చాలా అన్యాయం అని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకుడు, జీవీఎంసీ 32 వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ ఆమోదించడం లేదు అని ప్రకటించారు. షాడో మేయర్ చేతిలో జీ వీ ఎం సీ అవినీతి కూపంలో కూరుకుపోయింది. పలు అంశాల్లో తీర్మానం చేస్తున్నారు. కొన్ని పనులు ఎందుకు ఆగుతున్నయి. మేయర్ వార్డులో మాత్రమే వందల కోట్లతో పనులు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు, వారి కోసం ప్రశ్నిస్తే, మేయర్ బడ్జెట్ ఆమోదిస్తే చర్చిద్దాం అంటున్నారు. కమిషనర్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం అన్యాయం. సమస్యల మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. వేలాది కోట్లు సంపాదన ఎలా వచ్చింది. ప్రజలు కట్టిన పన్నులతో కొంతమంది జల్సా చేస్తున్నరు. జీ వీ ఎం సీ పాలక వర్గం దోచుకోవడం, దాచు కోవడంతోనే సరిపోతుంది. తన వార్డులో రూ.32 లక్షలతో చేట్టిన కళ్యాణ మండపం పనులు ఆపేశారు అని మండి పడ్డారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కౌన్సిల్ మీటింగ్స్ కి మీడియా ప్రవేశం మీద కూడా ఆంక్షలు సరికాదు అని విమర్సించారు. ఎం.పి.నిధులు రూ.10 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. సిరిపురంలో రూ.83 కోట్లకు టి డి ఆర్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. ప్రభుత్వంసాండ్, లాండ్, వైన్ విధానం చందంగా వుందని ఎద్దేవా చేశారు. మేయర్ వార్డుకు గతంలో కోటిన్నర ఇస్తాము అన్నారు, ఇప్పుడు రెండు కోట్లు ఇస్తాము అనీ మభ్య పెడుతున్నారు. సంక్రాంతి చేయడం లేదు. కార్మికులకు గురువారం తన నివాసంలో నిత్యావసరాలు పంపిణీ చేస్తాము అన్నారు. జనసేన ఫ్లోర్ లీడర్, 33 వార్డు కార్పొరేటర్ భీసెట్టి వసంత లక్ష్మి మాట్లాడుతూ అంకెల గారడీ బడ్జెట్ అని, వైసీపీ నేతలు దోచుకోవడానికి బడ్జెట్ తయారు చేశారు అన్నారు. అన్నివార్డులలో అభివృద్ధి చేశాముఅని చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో గతం కన్నా 10 శాతం పెంచాము అన్నారు. అన్ని వార్డుల్లో
మౌలిక సదుపాయాలు లేవు. టి డి ఆర్ స్కాం మయంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ జన సేన ప్రభుత్వం వస్తుంది అన్నారు.
పారిశుధ్య కార్మికులు సమ్మె మీద ప్రభుత్వం స్పందన లేదు, మేయర్ కూడా స్పందించకుంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో మహా ధర్నా చేస్తాము అన్నారు. 39 వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ మాట్లాడుతూ.. నాగరాజు సస్పెన్షన్ అన్యాయం అని మండి పడ్డారు. కమిషనర్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం అన్యాయం, ఆయనకు నోటీసు ఇవ్వాలి అన్నారు. కౌన్సిల్ కి అవమానం జరిగింది అని మండి పడ్డారు. అవిశ్వాసం ప్రవేశ పెడతాము. పోర్ట్ నుంచి రావల్సిన 51 శాతం నిధులు కోసం పాలకవర్గం కృషి చేయాలి అని కోరారు.