పోతిన వెంకట మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కంచికచర్ల జనసైనికులు

నందిగామ, జనసేన పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ జన్మదిన సందర్భంగా పలువురు అభిమానులు ఆయనను కలసి సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కంచికచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు తోట ఓంకార్ శుక్రవారం పోతిన మహేష్ కార్యాలయంలో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని జనసేన పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిపించాలని ప్రజా సమస్యలపై పోరాడుతూ రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందాలని వారు ఆకాంక్షించారు.