ఘనంగా కనపర్తి మనోజ్ కుమార్ జన్మదిన వేడుకలు

  • పొన్నలూరులో 10,000 ఓట్లు సాధించగల నాయకుడు

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ జన్మదినం సందర్భంగా శనివారం మనోజ్ కుమార్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కనపర్తి మనోజ్ కుమార్ పొన్నలూరు మండలం, చెరుకూరు గ్రామంలో కనపర్తి పెద్ద మాల్యాద్రి మరియు నరసమ్మ గార్లకు జూన్ 10, 1990వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఎంబీఏ వరకు చదువుకుని ఒకపక్క ఉద్యోగం చేస్తూ, ఇంకొకపక్క చిన్నపాటి వ్యాపారం చేస్తూ, మరొకపక్క జనసేన పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ, పొన్నలూరు మండలంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని ఏర్పాటు చేసుకొని అంచలంచలుగా ఎదుగుతూ.. నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ.. ప్రజల ప్రేమను పొందుతూ.. సేవా కార్యక్రమాలు చేస్తూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. దాదాపు కేవలం పొన్నలూరు మండలంలోనే 10,000 ఓట్లు సాధించగల ఒక దళిత నాయకుడిగా అంచలంచెలుగా ఎదగడం చాలా గొప్ప విషయం. చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే సమాజం కచ్చితంగా మారుతుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ జనసేన కనపర్తి మనోజ్ కుమార్. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం నాయుడు, మహబూబ్ బాషా, శ్రీను, సాయి, ఖాదర్ బాషా, పిల్లిపొగు పీటర్ బాబు, పెయ్యల రవి, తిరుమలరెడ్డి, నవీన్, శివ, చెన్నయ్య, లక్ష్మణ్, మొదలైన వారు పాల్గొన్నారు.