తాడిపత్రిలో ఘనంగా నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు

తాడిపత్రి, జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జనసేన నాయకులు మరియు జనసైనికులు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి పుట్టినరోజు సందర్భంగా ఆయన పార్టీకి చేస్తున్న సేవలు మరియు జనసైనికులని పార్టీలో క్రియాశీలకంగా మలచే తీరు అందరినీ కలుపుకొని పోయేతత్వం జనసైనికులను మరియు పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టకుంటున్నారు. అందుకు గాను నాదెండ్ల మనోహర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఘనంగా నిర్వించారు. ఇందులో తాడిపత్రి జనసేన నాయకులు కే ఏన్ చారి జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు మాదినేని గోపాల కృష్ణ, అల్తాఫ్ మరియు జనసైనికులు ఇమామ్, అఖిల్, మాలిక్ భాష, గిరి మరియు తదితరులు పాల్గొన్నారు.