శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న సంఘీభావ దీక్షను జయప్రదం చేయండి: బాడీశ మురళీకృష్ణ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం

ఆదివారం మంగళగిరిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో జరుగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలని కార్మికులు కొనసాగిస్తున్న పోరాటానికి అండగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తన్న సంఘీభావ దీక్షకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు వీరమహిళలు, పార్టీ శ్రేణులు అందరు సంఘీభావ దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ కార్మికులు కొనసాగిస్తున్న పోరాటానికి అండగా నిలుస్తూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ఈ సంఘీభావ దీక్ష ముగిస్తారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో కార్మికులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ ఆందోళన నిరవధికంగా కొనసాగిస్తూనే ఉన్నారు వారికి నైతిక మద్దతు కొనసాగింపులో భాగంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహారదీక్ష జరుగుతుంది విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని తొలుత కేంద్ర ప్రభుత్వ పెద్దలును కలిసి లేఖ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే 300 రోజులు పైబడి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం సాగిస్తున్నారు వీరికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మురళీ కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు తునికిపాటి శివ, నవీన్, సునిత్ లింగరాజు, గోపిచారి, చైతన్య, గోపినాధ్, నాగబాబు, శివశంకర్, శ్రవణ్, వినయ్, గోపయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.