నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. శ్రీ నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాలను అందించాలని కోరుకొంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.