ఘనంగా రాయపురెడ్డి కృష్ణ జన్మదిన వేడుకలు

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం, కె కోటపాడు మండలంలో కే కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజి బాబు ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని బ్లెస్సింగ్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటపాడు మండలంలో ఉన్నటువంటి 32 పంచాయతీల జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.