సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని శ్రీ సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్నేహశీలి అయిన శ్రీ సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో అటువంటి సమాజం కోసం తపిస్తారు. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. నటుడిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. నేను నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలోఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మూకాంబికా అమ్మవారి భక్తుడైన శ్రీ సముద్రఖనికి ఆ జగజ్జనని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.