మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ – ఉన్ – నబీ శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు ఇస్లాం మత విశ్వాసులైన వారందరికీ పర్వదినం. ముస్లిం చివరి ప్రవక్త ముహమ్మద్ సొల్లల్లాహు అలెహి వసల్లం జన్మించిన పుణ్యదినం. చంద్రమానం ప్రకారం జరుపుకొనే ఈ పండుగను ముస్లిం సోదరులు నేడు ఆచరిస్తున్న శుభ తరుణాన ఇస్లాం పట్ల నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ కీర్తి, సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. నా పక్షాన, జనసేన పక్షాన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.