శ్రీ కిషన్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమితులైన శ్రీ జి.కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నానని జనసేనాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.