శ్రీమతి పురందేశ్వరికి హృదయపూర్వక అభినందనలు
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమితులైన శ్రీమతి డి.పురందేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన శ్రీమతి పురందేశ్వరి గారు కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకు వెళ్తారనే భావన ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.