తిరుమలలో ‘నివర్’ ఎఫెక్ట్ తో భారీ వర్షం.. నిండిన డ్యాములు

నివర్‌ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు బలమైన గాలులు వీస్తుండటంతో చెట్లు విరిగిపడుతున్నాయి. ఈదురు గాలుల వల్ల పాప వినాశనం ఘాట్ లో చెట్లు విరిగిపడ్డాయి. తిరుమల కనుమ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కునుమ మార్గంలోని హరిణి ప్రాంతంలో రోడ్డుపై బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో అధికారులు వాటిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. కాగా, రెండో కనుమ మార్గంలో 14వ కిలోమీటరు వద్ద భక్తులు వెళ్తున్న కారుపై బండరాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదం నుంచి భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. రాళ్లు పడటంతో కారు ముందుభాగం ధ్వంసమయ్యింది. తిరుమల బాలాజీనగర్‌లో క్యూనిటీ హాల్‌ ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో రెండు మోటార్‌ సైకిళ్లు ధ్వంసమయ్యాయి.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల డ్యాంలన్నీ పూర్తిగా నిండాయి. అధికారులు పాప వినాశనం, గోగర్భం డ్యాంల గేట్లు ఎత్తివేశారు.