స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో డాక్టర్ రమేష్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌పై ఈరోజు హైకోర్టు స్టే విధించింది. డాక్టర్ రమేష్ ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్ రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ను గతంలో ఎయిర్ పోర్టు క్వారంటైన్ సెంటర్ గా నిర్వహించారా? లేదా? అని అడిగింది. అసలు స్వర్ణ ప్యాలెస్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను ఎందుకు బాధ్యులను చేయలేదని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రశ్నించించింది. దీంట్లో అధికారుల తప్పు కూడా ఉందని.. ఈ ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది.