ఇంటి ఇంటికి జనసేన సిద్ధాంతాలు, జనసేనాని భావజాలం

గుంటూరు: ఇంటి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి భావజాలం తెలియచేయాలి అనే ఉద్దేశంతో.. జనసేన పార్టీ నాయకుల సహకారంతో ఆదివారం గుంటూరు నగరంలో కొన్ని కుటుంబాలని కలసి పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకి తెలియజేసి వారు మరో పది మందినీ ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియా క్రియాశీల కార్యకర్తలు లక్ష్మీ శెట్టి సాయి చంద్ ( నానీ ), పమిడి పవన్, సి హెచ్. సాంబశివరావు, ఎం.డి రఫీ, మంత్రి లోకేష్, కాలంగి రాకేష్, ప్రేమ్ చంద్, దినేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.