900 మంది పేద విద్యార్థులకు ఆల్టర్నేట్ అడ్మిషన్ స్కూళ్లు ఎలా మూస్తారు..?

నెల్లూరు, రెండుసార్లు గెలిచిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేద విద్యార్థుల చదువును గాలికి వదిలేసి, తల్లిదండ్రులు ఎవరైనా కలెక్టరేట్ వద్దకు వెళ్తే మీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని తమ స్థానిక నాయకులతో బెదిరించడం సిగ్గుచేటని, సెయింట్ పీటర్ సెయింట్ జోసెఫ్ స్కూల్స్ మూయొద్దు మా పిల్లల విద్యా కాల రాయొద్దు అంటూ తల్లిదండ్రులతో కలిపి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుధీర్ బద్దెపూడి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కలెక్టర్ అందుబాటులో అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవోకి వినతిపత్రం ఇవ్వగా డిఇవోని పిలిచి 900 మందికి ఆల్టర్నేట్ గా అడ్మిషన్ మీరు ఇప్పించగలరా స్కూళ్లు ఎలా మూస్తారు..? అని ఆర్డీవో ప్రశ్నించి దీనిని పరిశీలించి తగిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ సెయింట్ పీటర్స్ హై స్కూల్ నందు 220 మంది, సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ ఎలిమెంటరీ స్కూల్ నందు 160 మంది, సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ నందు 226 మంది, సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హైస్కూల్ నందు 366 మంది సెయింట్ జోసెఫ్ మొత్తం దాదాపు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండుసార్లు గెలిచిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేద విద్యార్థుల చదువును గాలికి వదిలేసి,తల్లిదండ్రులు ఎవరైనా కలెక్టరేట్ వద్దకు వెళ్తే మీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని తమ స్థానిక నాయకులతో బెదిరించడం సిగ్గుచేటు. కొత్తగా గవర్నమెంట్ జీవో ను అనుసరించి ఎడిడెట్ స్కూల్ అయినా వీటిని రద్దు చేస్తున్నామని మీరు వేరే స్కూల్లు చూసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు ఈ వారంలో చెప్పి ఉన్నారు. సంతపేట కబడ్డీ పాలెం పరిధిలో దాదాపుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అంత కెపాసిటీ కలిగిన ఆల్టర్నేటివ్ ఏమీ లేవు. గత సంవత్సరాలలో ఆండాలమ్మ స్కూలు మరియు ఎస్ఆర్కే స్కూలు ఇప్పటికే మూసివేసి ఉన్నారు.ఇక ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ కూడా ఒకటి రెండు గదులతో దాదాపు 60, 70 మంది విద్యార్థులతో కిక్కిరిసి ఉంది. అందునా నెల్లూరులో చారిత్రాత్మకంగా పేరుబడిన ఈ స్కూల్లో రద్దు అందరూ హర్షించదగిన విషయం కాదు. ప్రభుత్వమే ఈ స్కూల్లను హెరిటేజ్ గా భావించి నడిపించినచో మంచిది. లేనియెడల సదరు ఏరియాల్లో గవర్నమెంట్ స్కూల్ ప్రత్యామ్నాయంగా చూపు వరకు స్కూల్లు నడిపించే బాధ్యతలను ప్రభుత్వం తీసుకోలసింది. ఈ ప్రాంతాలలో నివసించే వారందరూ పేదా బిక్కీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతో వారి విద్యా అవసరతను గమనించి సత్వరమే చర్యలు తీసుకొని ఈ సమస్య పరిష్కరించగలరు అని కలెక్టరు గారి తరపున ఆర్డిఓ ని కోరటం జరిగింది. ఆర్డీవో కూడా సానుకూలంగా స్పందించి 900 మంది పేద విద్యార్థుల్ని ఎక్కడ అడ్మిట్ చేయగలరు అని డిఇఓ ని ప్రశ్నించి దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పేద విద్యార్థులకు చదువుకు జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతాం. ఈ విషయంలో ఎంత దూరమైనా తగ్గకుండా స్కూల్స్ యధావిధిగా కొనసాగేందుకు మా వంతు మేం ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లి దండ్రులతో పాటు గునుకుల కిషోర్, సుధీర్ బదిదిపూడి, ఉమాదేవి, అశోక్, ఖలీల్,ప్రసన్న, మౌనిష్, వర, బన్నీ తదితరులు పాల్గొన్నారు.