మా అధినేత పవన్ కళ్యాణ్ కి Z+కేటగిరి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్: డా.వంపురు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, ఈమధ్య రాజకీయ పరిణామాలు అధికార పార్టీ వైసీపీ నాయకత్వం వారి పరిపాలనలో లోపాలను ఎత్తి చూపి ప్రశ్నిస్తే? వ్యక్తిగత దూషణలు చేయడమే కాకుండా ఒక కొత్త సంస్కృతి తెరలేపారు అధికార పక్షము, సుపారి హత్యలు కూడా ప్రారంభించారు. బహుశా కడప ఫ్యాక్షన్ హత్యల రాజకీయాలకు ఇది కొనసాగింపు అని ప్రజలు భావించాలేమో? అంటూ సూటిగా అధికార పక్షాన్ని నిలదీసిన డా.వంపురు గంగులయ్య. ప్రజాస్వామ్య దేశంలో హత్యరాజకీయలకు, అవినీతి రాజకీయలకు తావులేదు కానీ గత కొంత కాలంగా రాష్ట్రం మొత్తం జనసేన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఏదో రకంగా అధికార పక్షము అడ్డుపడుతున్న దాఖలాలు ప్రజలకు తెలిసిందే? కానీ తెలియని విషయమేమిటంటే సిద్దవటంలో రైతుల కోసం సహాయక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటినుండే రెక్కీ నిర్వహించిన సుపారి హంతకులు. ఈ హంతకులను ఎంచుకుని 250 కోట్ల ఒప్పందానికి తెగించారు. ఇది ఎంతమాత్రం క్షమించదగ్గవిషయం కాదు. మా నాయకుడితో రాజకీయంగా ఎదుర్కోలేని అధికార పక్ష నాయకులకు వచ్చే ఆలోచన ఇది. ఇన్నాళ్లు హత్య రాజకీయాలు, డ్రామా రాజకీయాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేసే రాజకీయాలు చేసిన వైసీపీ ఇప్పుడు సరికొత్త ప్రణాళిక చేస్తుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ కి ఏదైనా చేయాలని మీరు తెలిస్తే మీ వినాశనం మీరు కోరి తెచ్చుకున్నట్టె? అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్నాళ్లు పాలనాపరమైన లోపాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలతో కాలం వెళ్లబుచ్చి ఏదో సాధించేసాం అనుకుంటున్నారు. ఇకపై ఇలాంటి తలతోక లేని వ్యవహారాలకు చోటు లేదు. అసలు ఢిల్లీ నిఘా విభాగం ఇచ్చిన నివేదికల సారాంశమేమిటి? ప్రజలకు తెలియాల్సిందే? హత్యారాజకీయలతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం సృష్టించి అంతిమంగా ఏమి సాధిద్దామనుకుంటున్నారు? ముఖ్యమంత్రి. ఈ విషయంలో జనసేన నాయకత్వం జనసైనికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మా అధినేత పవన్ కళ్యాణ్ కి Z+కేటగిరి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని. జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య తెలిపారు.