ఎమ్మెల్యేగా గెలిచాకా నా ఆస్థి ఏమాత్రం పెరిగినా ప్రజలే పంచుకోవచ్చు జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశంలో పాటంశెట్టి

  • 100 రూపాయల స్టాంప్ పేపరుపై రాసిస్తా
  • జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో సురేష్ వరికూటి అధ్యక్షతన 6 సార్లు ఉత్తమ సర్పంచ్ జాతీయ అవార్డును తీసుకున్న జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రతో శనివారం జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్యలక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రతో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలపై చర్చించడం జరిగింది. సుమారు 3 గంటల పైగా జరిగిన ఈ సమావేశంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి మరియు జనసేన అధినేత తలపెట్టిన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘటనను ఖండించడం జరిగింది. బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ గురించి జనసేన కర్యకర్తలకు శిక్షణ ఇచ్చి బలమైన మేనేజ్మెంట్ కోసం బూత్ కన్వినర్ వ్యవస్థను నిర్మించి పటిష్టం చేయాలని అన్నారు. జనసేన కార్యక్రమాలను బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు ఎన్నారై మిత్రులు ఎంతగానో సహకరిస్తునారని, సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నారై మిత్రులకు ధన్యవాదములు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 327 వరోజు విజయవంతంగా చేసామని రానున్న 7 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో మాత్రమే పనిచేస్తామని, జనసేన వనరక్షణ ద్వారా నియోజకవర్గం మొత్తం లక్షల సంఖ్యలొ నిమ్మ, దానిమ్మ మరియు జామ మొక్కలతో పాటూ ఈ సంవత్సరం పూల మొక్కలను కూడా పంచుతున్నామని అన్నారు. జనసేనపార్టీ 7 సిద్దాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నారై జనసైనికుల సహాయంతో “జనసేన తోడు – నీడ” అనే కార్యక్రమం ద్వారా 14 కుటుంబాలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చామని తెలిపారు. 18 సంవత్సరాలుగా సర్పంచ్ గా చేసిన ఆయన నిత్యం ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయనకు ప్రస్తుతం 2 ఎకరాల పొలం కొంచెం ఆస్థి ఉన్నదని, ఎమ్మెల్యేగా గెలిస్తే 5 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటుందని అంతకు మించి ఉంటే దానిని ప్రజలు పంచుకోవచ్చని దీనికి సంబంధించి 100 రూపాయల స్టాంప్ పేపరుపై రాసిస్తానని కూడా ఆయన తెలిపారు. ఆయనను గెలిపిస్తే ప్రజలే గెలిచినట్లని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఎన్నో ఆమరణ నిరాహార దీక్షలు చేసి విజయం సాధించిన విషయం తెలిసిన విషయమే. ప్రభుత్వం పలు పధకాలను పెట్టినా ఇంటికి ఒక పధకం మాత్రమే అందిస్తున్నారు తప్పితే అన్ని పధకాలు ఒకే కుటుంబానికి ఇవ్వట్లేదని అది ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేస్తున్న కార్యక్రమాలను ఎన్నారై జనసేన నాయకులు అభినందించడంతో పాటూ ఆయన చేసే కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలియజేసారు. ఈ సమావేశంలో జె.ఎస్.పి గ్లోబల్ టీం కోర్ సభ్యులు అమీర్ ఖాన్(సౌది అరేబియా), పాపోలు అప్పారావు(యూఏఈ), సుధాకర్ వరికూటి(జర్మని), డా.ప్రవీణ్ రాయల్(సౌత్ కొరియా), లోకేష్ పెద్దిరెడ్డి(జర్మని), ప్రసన్న(యూకె), రత్న పిల్లా(ఇండియా), రవి వర్మ(యూఏఈ), డా.కె. నవీన్(సౌత్ కొరియా), నవీన్ నవబోతు(కంబోడియా), సుబ్రహ్మణ్యం(జర్మని), అఖిల్ ఆవుల(జర్మని), శ్రీనాథ్ వట్టికూటి(యూకె) మరియు సాంబశివ (స్వీడన్) లతో పాటూ ఇతర దేశాల నుండి పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.