నాగబాబుకి ఘనస్వాగతం పలికిన యూకే జనసేన

లండన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణెదల నాగబాబు యూరప్ పర్యటనలో భాగంగా ఈ నెల 22వ తేదీన లండన్ లో యూకే జనసేనతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 21వ తేదీన లండన్ చేరిన నాగబాబుకి లండన్ ఎయిర్ పోర్టులో యూకే జనసేన ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఫౌండర్ మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ సురేష్ వరికూటి, శతఘ్ని న్యూస్ డైరెక్టర్ మరియు యూకే జనసేన వీరమహిళ పద్మజ రామిశెట్టి, యూకె జనసేన నాయకులు నాగరాజు వడ్రాణం, శంకర్ సిద్ధం, చందు సిద్ధం, నాగేంద్ర సోలంకల, అరుణ్ కుమార్ గంటా, శివ మేకా, బాల నల్లి, శివ గంటా, శ్రీనివాస్ రంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాగబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని యూకేలో ఉన్న జనసైనికులు మరియు వీర మహిళలతో కలిసి జనసేనని ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తీసుకొని వారి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చి వారిలో ప్రోత్సాహాన్ని నింపడం జరిగింది.