జనసేన ఆవిర్భావ వారోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • మార్చ్ 14వ తేదీ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆవిర్భావ వారోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ:

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆవిర్భావ వారోత్సవ వేడుకల పోస్టర్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి చేతులు మీదుగా గురువారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి మాధవరెడ్డి మాట్లాడుతూ “ఈ వారోత్సవాలు మార్చ్ 8వ తేదీ నుండి మార్చ్ 14వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ వారోత్సవాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు నుండి ప్రజల పక్షాన వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వివిధ డివిజన్ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు, జనసైనికులు పాల్గొన్నారు.