యువత ధైర్యంగా ముందుకు రావాలి: బత్తుల

  • పలుచోట్ల అరాచక, కక్షపూరిత, వ్యర్థపాలన చేస్తున్న వైసీపీ సర్కారుపై ప్రజల తిట్ల దండకాలు
    *బడుగు, బలహీన, వెనకబడిన వర్గాలకు రాజ్యాధికార కోసమే జనసేన పార్టీ సామాన్యులకు నమ్మకంగా సేవ చేసే నవతరం పార్టీ జనసేన పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి.
  • బత్తుల సేవాతత్వం, నాయకత్వంపై ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న నమ్మకం అన్ని వర్గాల్లో చాపకింద నీరులా పెరుగుతున్న ఆదరణ

రాజానగరం, 66వ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా కోరుకొండ మండలం, కోరుకొండ బీసీ కాలనీలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తలు వెంకటలక్ష్మి విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ మన హక్కుల్ని కాలరాసి, మన సంపదను దోచుకునే ఈ వైసీపీ నాయకుల మీద పోరాటం చేసి, గద్దె దించి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే సమయం ఆసన్నమైందని జనానికి నమ్మకంగా సేవ చేసే నవతరం పార్టీ జనసేన పార్టీ అని, ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్న వాడికి కొంచెం సాయం, బాధలో ఉన్న వాడికి కొంచెం ఓదార్పు అందించడమే మానవత్వమని, అలాంటి నిండు మనసున్న నేత నేటి సమీకాలిన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే అని, ఈసారి ఆయన్ని ఆశీర్వదించి ఆదరించాలని గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన కరపత్రాలను విరివిగా పంచడం జరిగింది. ఈ మహాపాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.