జనసేనానిపై నోరు జారితే బట్టలు విప్పదీసి – బొక్కలో కూర్చోబెడతాం: కిరణ్ రాయల్

•ఆర్&బి మంత్రి కాదు – పి&ఎం మంత్రి..
•దాడిశెట్టి రాజా కాదు – బోడిశెట్టి..
•గంజాయి అమ్మేవాళ్ళు, దొంగ బంగారం వ్యాపారం చేసి వాళ్లకి మంత్రి పదవులు
..

రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా కు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసే నైతిక హక్కు లేదని జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఫ్లకార్డులను ప్రదర్శించి, ఆర్ అండ్ బి మంత్రి తీరును నిరసిస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు.

రహదారులను బాగుచేయాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు
మూడు రోజుల పాటు.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ” గుడ్ మార్నింగ్ సి.ఎం. సార్ కార్యక్రమాన్ని ” విజయవంతం అయినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే నైతిక హక్కు ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టికి లేదన్నారు మంత్రి దాడిశెట్టి వ్యక్తి గత ఆరోపణలకు దిగితే అదేస్థాయిలో జనసేన నాయకులు కూడా తగిన రీతిలో బదులిస్తామన్నారు కాపుకోటాలో దాడిశెట్టికి మంత్రి పదవి రాలేదు.. గంజాయి కోటాలో వచ్చిందని విమర్శించారు బంగారం, గంజాయిలను అక్రమంగా తరలించడంతో పాటు, దొంగవ్యాపారాలు చేసే…మంత్రి రాజా ఈ స్థాయికి ఎదిగారన్నారు..

విలేకరి సత్యనారాయణ హత్య కేసులో మంత్రి దాడి శెట్టి ముద్దాయి కాదా…! ఆ కేసు ఫైల్లెక్కడని నీలాదీశారు, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి దాడిశెట్టి బండారాన్ని బయటపెడతాం, కమిటీ వేసి విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు..

అదేవిధంగా నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మరియు ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

ఈ విలేకర్ల సమావేశంలో జనసేన నాయకులు రాజేష్ యాదవ్, హేమ కుమార్, సుమన్ బాబు, మునస్వామి, రాజేష్ లు పాల్గొన్నారు.