సీఎం సభ కోసం చేసే అక్రమ వసూళ్లు వెంటనే ఆపాలి: శేషుబాబు

అవనిగడ్డ, ముఖ్యమంత్రి అవనిగడ్డ పర్యటన సందర్భంగా అవనిగడ్డలోని వ్యాపారస్తుల నుండి బలవంతంగా షాప్ కి 2వేలు, 3 వేలు ఇవ్వాల్సిందే అని వసూళ్లు చేసే అధికారులు, నాయకులు వెంటనే ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు హెచ్చరించారు. సీఎం పర్యటనకు వ్యాపారస్తులకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఇప్పటికే వసూలు చేసిన అమౌంట్ ను వ్యాపారస్తులకు తిరిగి ఇవ్వక పోతే, జనసేన పార్టీ తరపున ఆందోళన చేస్తామని చెప్పారు. వ్యాపారస్తులు ఎవ్వరికీ భయపడ నవసరం లేదని, జనసేన పార్టీ తరపున అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అలాగే అవనిగడ్డలో ఉన్న జనసేన మరియు టిడిపి పార్టీలకు సంబందించిన ఫ్లెక్సీలను తొలగించి, అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే ఉంచటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఫ్లెక్సీలను చూసి, అధికార పార్టీ వారు ఉచ్చ పోసుకుంటున్నారనీ, అందుకే తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను కడుతూ, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సీఎం వస్తే వ్యాపారాలు చేసుకో కూడదా, రాజారెడ్డి రాజ్యాంగంలో అలా వ్రాసి ఉందా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలు తప్పని సరిగా రావాల్సిందే అని రాకపోతే లోన్ లు రావని, వివిధ పధకాల లబ్దిదారులు రాకపోతే పథకాలు ఆగిపోతాయని వాలంటీర్లు చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని, ప్రజలకు ఇష్టం అయితేనే సీఎం సభకు వెళ్ళండని, తప్పనిసరి ఏమీ కాదని చెబుతూ, ఏ పథకం ఆగదు అని, ఏ లోన్ ఆగదని, ఈ విషయంలో ప్రజలకు, లబ్ధిదారులకు జనసేన పార్టీ సపోర్టుగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, చల్లపల్లి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల ప్రసాద్, సూదాని నంద గోపాల్, సోమిషెట్టి రాఘవ, దాసు, బచ్చు శ్రీహరి, కృష్ణ కుమారి, నరేష్, అవినాష్, రోహిత్, శ్రీ భాస్కర్, పృథ్వి, కమ్మిలి వేణు, తోట ఆంజనేయులు, పుప్పాల రామకృష్ణ, తిమ్మన వంశీ, మిరియాల జితేంద్ర, తదితరులు పాల్గొన్నారు.