తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు

  • జనసేన క్రియశీలక సభ్యుడు గంజి గోవిందరాజుకు 50,000 రూపాయలు చెక్ అందజేత
  • వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు
  • కుల మత ప్రాంతీయ బేధాలు సృష్టించిరాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు
  • ప్రజల్లో ఘనమైన మార్పు మొదలైంది
  • అన్ని వర్గాల ప్రజలకు ఆశాదీపంగా జనసేన పార్టీ ఏకైక దిక్కుగా కనపడుతుంది
  • మన ఆస్థులు మీద ప్రభుత్వ పెత్తందారులా పెత్తనం రోజు రోజుకి ఎక్కువవుతుంది
  • పిల్లల చదువు పేరు చెప్పి డాలర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించే భారీ కుట్ర
  • పిఠాపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేస్తామని ధీమా
  • పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం రూరల్ మండలం కుమారపురం గ్రామానికి చెందిన యువత, మహిళలు భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. పిఠాపురం మండలం రూరల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వివిధ వర్గాలకు చెందిన పలువురు యువత, మహిళలు పెద్దసంఖ్యలో జనసేనలో చేరారు. వారికి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ముఖ్య నాయకులు సుబ్రహ్మణ్యం, తాటికాయల సత్తిబాబు, రాఘవ, నక్క వెంకట్ రమణ, యాదగిరి లోవరాజు మరియు వారి మిత్ర బృందమునకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అధికారాన్ని చేపట్టిన క్షణం నుంచి రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా బ్రతకడం లేదని, వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అంటే జనసేన-టిడిపి ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని అందుకే జనసేన పార్టీపట్ల ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడా వేయలేదు అంటే పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. కొండ, గుట్ట, ఇసుక, మట్టి వంటి సహజవనరులను కొల్లగొడుతూ ముందుతరాల వారికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో ఒక చేతికి 10 రూపాయలు ఇచ్చి ఇష్టానురీతిలో పన్నుల రూపంలో 90 రూపాయలు లాక్కుంటున్న వైసీపీ ప్రభుత్వ దమనరీతిపై ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. రాష్ట్రానికి జనసేన పార్టీ అవసరం ఎంతైనా ఉందన్న ఆలోచనతో ప్రజలు నిస్వార్థంగా జనసేనలో చేరుతున్నారని తెలిపారు.అనంతరం ప్రమాదవశత్తు కొన్నాళ్ళు క్రితం ఆక్సిడెంట్ అయిన జనసేన క్రియశిలక సభ్యుడు గంజి గోవిందరాజుకు 50,000రూపాయలు చెక్ ను ఉదయ్ శ్రీనివాస్ చేతులు మీదుగా అందజేశారు. పవన్ కళ్యాణ్ జనసైనికుల కొరకు నిరంతరం ఆలోచిస్తారని వారి సంక్షేమదృష్ట్యా భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమలకు శ్రీకారం చూడతారు అని వ్యక్తం చేశారు. సభలో ఉన్న మహిళలును ఉద్దేశించి ప్రైమ్ 2.0 గురించి మరియు ప్రభుత్వం ఐబీ సిలబస్ కుట్ర కోణం గురించి స్పష్టంగా వివరించారు.

  • మన ఆస్థుల మీద ప్రభుత్వ పెత్తందారులా పెత్తనం ఏంటి?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డ్‌ ప్రైమ్‌ 2.0 గురించి సభలో స్పష్టంగా అందరికి అర్థమయ్యేలా వివరిస్తూ మన ఆస్థులను లాక్కోవడానికి కొత్త విధానం తీసుకుని వచ్చారు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాలంటీర్స్ ద్వారా డేటా మొత్తం సేకరించి డిజిటల్ విధానం పేరుతో ప్రజలు ఆస్తులతో ఆడుకోవాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వన్నీ ఇంకొన్ని రోజుల్లో మీరు అందరు బటన్ నొక్కి ఇంటికి పంపించేయాలి అని విజ్ఞప్తి చేశారు.

  • ప్రభుత్వం మన పిల్లల మీద ఐబీ సిలబస్ ను బలవంతంగా రుద్దే కుట్ర

ప్రపంచ వ్యాప్తంగా ఐబీ సిలబస్ ఉన్నది కేవలం 4 వేల పాఠశాలలు మాత్రమే అయితే మన ఆంధ్రప్రదేశ్ లో 44వేల స్కూల్స్ కి అప్పగించేలా చర్యలు చేపట్టడం సిగ్గుచేటు. దానికి 4వేల కోట్లకు పైగా జగన్ రెడ్డి కొత్త విధానంతో మనం పన్నులు రూపంలో కట్టే సొమ్మును సింగపూర్ డాలర్లలో మల్లించేలా ప్రయత్నం, భారత చట్టాలు పని చేయవు సిట్జర్లాండ్ చట్టాలే చెల్లుతాయని నిబంధనలు పెట్టి దోచుకోడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు అంటూ దుయ్యబట్టారు. ఐబీ సిలబస్ అమలు నిలిపివేయాలి అని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు ప్రకారం చర్యలు తీసుకోవాలి అని హితవు పలికారు. అనంతరం పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ ఉదయ్ శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిపించుకొని తిరుతాం అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం నాయకులు మరియు మండల నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.