పెనుగంచిప్రోలు జనసేన ఆధ్వర్యంలో జెండా దిమ్మ ఆవిష్కరణ

జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు, మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో పెనుగంచిప్రోలు జనసేనపార్టీ అధ్యక్షులు తునికాపాటి శివ ఆధ్వర్యంలో జనసేన జెండా దిమ్మ ఆవిష్కరించిన ఉమ్మడి కృష్ణజిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ. రామకృష్ణ మాట్లాడుతూ… జనసేనపార్టీ అధికారంలోకి వస్తే రైతులకు, మహిళకు భవన కార్మికులకు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ వైసీపీ పాలన అరాచకాలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఒకవైపు ఇసుక, మట్టి మాఫియా, ఇంకో వైపు ఆడపిల్లలకు రక్షణ లేదు నియంత పాలన చేస్తుంది ప్రజలు ఏమైయి పోతే మాకు ఏంటి అని ప్రభుత్వం వ్యవరిస్తుంది అని ఘాటుగా విమర్శలు చేసారు జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ అమ్మఒడి ఎగ్గొట్టాలని రాష్ట్రంలో విద్యార్థులు జీవితాలతో ఈ ప్రభుత్వం అడుకొంటుంది మొన్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు పలితాలు చూస్తే తెలుస్తుంది ఎంత మంది పెయిల్ అయ్యారో ప్రజలు అందరికి తెలుసు ఎప్పుడు లేని విదంగా ఈ సంవత్సరం పెయిల్ అయ్యారు పెయిల్ అయిన విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వ అక్కరలేదని ఇది వైసీపీ పక్క ప్లాన్ మీద వెళ్లారు వేలా కోట్లు మిగులుతుంది అని , అలాగే జనసేనపార్టీ అధికారంలోకి వస్తే మహిళకు గ్యాస్ సిలెండర్లు, రేషన్ బదులు మీ బ్యాంక్ కథలోకి 2500 నుండి 3500 రూపాయిలు వేస్తాం, మహిళకు రక్షణ కల్పిస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తాం, 60 సంవత్సరములు దాటిన రైతులకు 5వేలు పింఛన్ జనసేనపార్టీ ఇస్తుందని శ్రీకాంత్ మాట్లాడారు. పెన్నా-కృష్ణ కో-ఆర్డినేటర్ రావి సౌజన్య మాట్లాడుతూ… 30 కోట్లు పెట్టి 3 వేల మంది కవులు రైతులకు జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఇస్తున్నారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు ఇవ్వలేదు రైతులు కష్టాలు పవన్ కళ్యాణ్ కి తెలుసు కాబట్టి రైతు బాగుండాలని ఈ నిర్ణయం తీసుకొని చనిపోయిన కవులు రైతుకు లక్ష రూపాయలు ఇస్తున్నారు, కరంటు రేట్లు పెంచేశారు, నిత్యావసర వస్తువులు పెంచేశారు, ఇసుక రేట్లు పెంచారు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బడిసా మురళి, కార్యదర్శి చింతల లక్ష్మీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మండల కమిటీ నాయకులు తునికాపాటి శివ, గోపినాద్, నరసింహరావు, మరియు మండల కమిటీ సభ్యలు జనసేపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.