Razole: భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు – పినిశెట్టి బుజ్జి

రాజోలు నియోజకవర్గం, నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగని రాజ్యాంగ అసెంబ్లీ 1949 నవంబర్ 26 న స్వీకరించింది ఈ సందర్భంగా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను స్మరించుకుంటూ నవంబర్ 26 ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
అప్పటి నుండి నవంబర్ 26 ని భారత రాజ్యాంగ దినోత్సవంగా మనందరం జరుపుకుంటున్నాం. నేటికీ మన నవ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ స్వీకరించి 69 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా భారతీయులందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాజోలు జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి.