వీళ్ళా రాష్ట్రాన్ని పాలించే నాయకులు?: చిర్రి బాలరాజు

  • భావ ప్రకటన చేసే స్వాతంత్రం ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది
  • వైసీపీ నాయకులపై మండిపడిన పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల పూర్తయిన సందర్భంగా కొణిదెల చిరంజీవి ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నేటి గవర్నమెంట్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వంతుగా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన ఇచ్చిన సలహాలు ఏమిటి అనే విషయాన్ని మరిచిపోయి ఆయనను అనుచిత వాక్యలతో అవమానకరంగా మాట్లాడిన తీరు ఘోరమైనదని పోలవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బాలరాజు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో భావ ప్రకటన చేసే స్వాతంత్రం ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. ఒక విషయంలో మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు వారి యొక్క మనసులో ఉన్న మాటనే చెప్పుకోవడానికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఒక సెలబ్రిటీ, ఒక మాజీ మంత్రి, ఎంతోమందికి ప్రాణదాత, బ్లడ్ బ్యాంక్ నిర్మించిన వ్యక్తి కొణిదెల చిరంజీవి గారు అంతట వ్యక్తికే భావ ప్రకటన చేసే స్వాతంత్రం లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగ కల్పన, ప్రజా సంక్షేమం ఏంటి అనే విషయాల మీద ఆయన సలహాలు ఇచ్చారు. కానీ వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సినిమా ఇండస్ట్రీ నుంచి వ్యక్తులు ఇచ్చే సలహాలు ఎందుకని ఇబ్బందిగా కనిపిస్తున్నాయని, మంత్రులు మాట్లాడే విధానం చూస్తుంటే సినిమాలు అనేది ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం, మీరు రాజకీయాల్లోకి రాకూడదు, ప్రశ్నించకూడదు, మీరు అలాగే ఉండాలి అనే విధంగా మాట్లాడుతున్నారని, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ గారు లాంటి ఒక కథానాయకులను పకోడీ అనడం ఏంటి అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో యువతను పాడుచేసేవిధంగా డైలాగ్స్ ఉన్నాయని పవన్నామస్మరణం చేసే మీ నాయకులు రాంగోపాల్ వర్మ లాంటి పనికిమాలిన చవట దద్దమ్మ ఆడవారిని బట్టలు లేకుండా తీస్తున్న సినిమాలకు ఏం సమాధానం చెప్తారు?. మీరు పేరుకే మంత్రులు గాని ఎవరి శాఖ ఏంటి అనేది ఒక్కరికి కూడా తెలియదని, వారి గురించి మాట్లాడటానికి మీకు ఏమి అర్హత ఉందని?, ఒకరు మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మీరు పని చేయట్లేదు అనే కదా అర్థం.. ప్రజల మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం పనిచేసి ఉంటే మిమ్మల్ని కూడా అందరూ ఆదరిస్తారు కదా? ఇప్పటికే పనికిమాలిన సలహాదారులు పెట్టుకొని రాష్ట్ర నాశనం చేస్తున్నారు, ఇక ఇలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలను పెట్టుకొని రాష్ట్రాన్ని పాతాళంలోకి తొక్కేయొద్దన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, గుడివాడ అమర్ నాద్, అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఎన్ని రకాలుగా హెచ్చరించినా సరే మీ తీరు మార్చుకోవడం లేదని మీకు బుద్ధి చెప్పే రోజులు ముందే ఉన్నాయని మండిపడ్డారు.