రెండవ స్థానంలోనిలిచిన భారత స్టార్ ప్లేయర్ హరికృష్ణ
బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ రెండవ స్థానంలో నిలిచాడు. స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న చెస్ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లు స్కోరు సాధించగా… ఆరు పాయింట్లతో వొజ్తాసెక్ (పోలాండ్) విజేతగా మొదటి స్థానంలో నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో మూడు గేముల్లో విజేతగా తన సత్తా చాటిన హరికృష్ణ, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. నేటి నుండి క్లాసికల్ విభాగంలో ప్రారంభంకానున్న మరో టోర్నీ.