వారం రోజులలో జారీ చేయనున్న టెన్త్ ఒరిజినల్‌ మెమోలు

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులందరికి లాంగ్‌ ఒరిజినల్‌ మెమోలను ఒక వారం రోజులలో పంపించనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.

కోవిడ్‌-19 కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం విదితమే. దీనితో రాష్ట్రంలో 2020 మార్చి నాటికి నవెూదైన పదవ తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు రాయకుండానే పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. పాసైన విద్యార్థులందరికీ షార్ట్ మెమోలను ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వైబ్‌సైట్‌లలో పొందుపరిచడం జరిగినది. అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే… సవరణకు గడువు ఇవ్వగా ఆ గడువును కూడా రెండు సార్లు పొడిగించింది. ఇక మెమోల పంపిణీ కంటే ముందు విద్యార్ధుల పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు లాంటి వివరాలలో అక్షర దోషాలు ఉన్నట్లయతే సరిచేసుకోవడానికి అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే ఒరిజినల్ లాంగ్ మెమోలను స్కూళ్ల వారీగా పంపిస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకునే అవకాశం కల్పించారు..