భిన్న ఆచారాలను ఆచరించు వారికి ఒకే స్మశానవాటిక కేటాయించడం న్యాయమా..?: రామదాసు చౌదరి

మదనపల్లె: మంగళవారం మదనపల్లె మండలం, రామాచారి పల్లెకు అనుకోని ఉన్న 6.75 స్మశాన వాటిక స్థలాన్ని రెవెన్యూ వారు సబ్ డివిజన్ చేసి 1.75 ఎకెర్స్ ఇతర మతస్థులకు ఇవ్వడము జరిగినది.. 1912 నుండి హిందూ స్మశాన వాటికకు కేటాయించబడిన పై స్థలాన్ని ఇప్పడు క్రిస్టియన్స్ అక్కడ ఇవ్వమని కోరక పోయినా కేవలం హిందువులకి క్రిస్టియన్స్ కు చిచ్చు పెట్టుట కోసము ఒకే చోట కేటాయించారు. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్మశానంలో సబ్. డివిసన్ చేసి ఈ విధంగా ఇవ్వడము తప్పు అని.. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు పార్టీలకి అతీతంగా ఇక్కడికి వచ్చి వారి నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనిర్ గాంగారవు రామదాసు చౌదరి మాత్లాడుతూ .. భిన్న ఆచారాలను ఆచరించు వారికి ఒకే స్మశానవాటిక లో కేటాయిస్తే కుదురుతుందా అని ప్రశ్నించారు.. పార్టీలకు అతింతగా గ్రామ పెద్దలు లక్షన్న రమణ, జంగాల శివరాం, గజ్జెలు రెడ్డప్ప, కురజల కుమార్, నవీన్, సురేంద్ర, నగరాజ్, అర్జున ఇంకా స్మశానవాటిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.