బిసిల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే: గంగారపు రామదాస్ చౌదరి

  • జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి

మదనపల్లె, ఆధునిక భారతదేశ జాతిపిత, సమసమాజ స్థాపకుడు మహానీయుడు జ్యోతి బాపూలే అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మ ఫూలే 197 వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. జ్యోతిబాపూలే చిత్రపటం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతూ మహాత్మ జ్యోతిరావు ఫూలే అడుగు జాడల్లో నడుస్తున్నారని వివరించారు. భారతదేశంలో మొట్టమొదటిగా కుల, మత అసమానతలు ఉండకూడదని మనుషులంతా సమానమని తెలియజేసిన మహనీయుడు పూలే అని, దేశంలోని ప్రజలందరూకి చదువు ఉండాలని బడులు ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలకు మరియు బహుజనులకు చదువు నేర్పించడం మరియు దేశంలో కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ భేదం లేకుండా సమానత్వానికి మొట్టమొదట బీజం వేసినటువంటి మహనీయుడు పూలే అని ఆయనను మహాత్ముడుగా పిలవబడుతున్నానని తెలియజేశారు. ప్రజలంతా మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచనలని సిద్ధాంతాలని తెలుసుకొని వాటిని భావితరాల బిడ్డలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూరల్ ప్రెసిడెంట్ గ్రానైట్ బాబు, రామసముద్రం వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, జనార్ధన్, గణేష్, కుమార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.