జగన్ ను దేనికి ఇన్స్పిరేషన్ స్టార్ గా తీసుకోవాలి..?

  • భార్య కోసం బాబాయిని హతమార్చినందుకు
  • 18 నెలలు జైల్లో చిప్పకూడు తిన్నందుకా
  • జగన్ ను కాదు రోజాని ఆదర్శంగా తీసుకోవాలి
  • రోజాపై ధ్వజమెత్తిన కిరణ్ రాయల్..

తిరుపతి: చిత్తూరులో అమ్ముల్ డైరీ శంకుస్థాపన సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మాట్లాడుతూ… జనసేనానిని విమర్శించడాన్ని, తప్పుపడుతూ జనసేన నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, ముక్కు సత్యవంతుడు, హేమ కుమార్, కొండ రాజమోహన్, మునుస్వామి, మనోజ్, ఆది కేశవులు తదితరులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ చేసిన హత్యలు, అవినీతి, దోపిడీ రాజకీయఒ, జైలు జీవితాలను చూసి జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు. దీనికన్నా అన్నింటిలో అనుభవం ఉన్న రోజానే మిన్న అంటూ రోజా అవ్వ ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రోజాను ఆదర్శంగా తీసుకుంటామని చురకలు విసిరారు. ఈసారి నగిరి ప్రజలు, వైసీపీ అధిష్టానం రోజాకు బిస్కెట్ వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ కు దమ్ముంటే 175 స్థానాలు గెలవడం కాదు. ఆ స్థానాల్లో రోడ్లు తదితర అన్ని సమస్యలను తీర్చి 175 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేయాలి గాని లక్ష్మణ (ప్రగల్బాలు) మానుకోవాలని కిరణ్ హెచ్చరించారు.