పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం, అనుసరణీయం: డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండల కేంద్రం, జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉమ్మడి మద్రాసులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని వేరుచేసి, ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసారు. ఆయన జీవితం చిరస్మరణీయం, అనుసరణీయమని స్తుతించారు. ప్రజలకు ఉపయోగపడని, కార్యకర్తలకు ఉపయోగపడని, నాయకులకు, ఉపయోగపడని నియోజకవర్గానికి ఉపయోగపడని స్థానిక ఎమ్మెల్యే, ఎక్సైజ్ మంత్రి,ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎంతమంది చేత మాట్లాడించినా, ఎవ్వరు మాట్లాడినా నువ్వు ఓడటం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి జనసేన-టిడిపి సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఒక లక్ష యాభై వేల ఓట్లతో జనసేన-టిడిపి గెలవడం ఖాయమని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి సంయుక్తంగా సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఉద్ఘట్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయల పాలన తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, మండల కార్యదర్శి రూపేష్, ఎస్ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు చార్లెస్, ఎస్ఆర్ పురం మండల యువజన అధ్యక్షులు బాలరాజు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు రాఘవ, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు రషీద్, బూత్ కన్వీనర్ తులసి రామ్, వెదురు కుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, జనసైనికులు పాల్గొన్నారు.