కనిగిరి జనసేన ఆధ్వర్యంలో ‘జగనన్న ఇళ్ళు – పేదలందరికి కన్నీళ్లు’

కనిగిరి, ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త యలమందల రహిముల్ల సూచనల మేరకు కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం జనసేన ఆధ్వర్యంలో ‘జగనన్న ఇళ్ళు – పేదలందరికి కన్నీళ్లు’ నిర్వహించడం జరిగింది. చిలకపాడు రెవెన్యూ పరిధిలో నవరత్నాలు జగనన్న కాలనీ పేరుతో ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో చాలావరకు అధికార పార్టీకి చెందిన నాయకుల యొక్క బంధు వర్గానికి ఆ పార్టీకి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇండ్ల సముదాయము ఏమాత్రం నిర్మాణానికి ఆమోదయోగ్యంగా లేని స్థలాలను కేటాయించారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి 1,80,000 గవర్నమెంట్ ఇస్తానని చెప్పి ఆ డబ్బులను కూడా జారీ చేయడంలో చాలా ఆలస్యం అవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, గోస్ట్ సునీల్, బొందిల నారాయణ, సూర్య నారాయణ, ముత్తు నాగేంద్ర, తోట పవన్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.