జగనన్నా….జాబ్ ఏదన్నా!

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూసి చూసి నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మూడేళ్లలో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే డీఎస్సీ ప్రకటించింది లేదు. పైపెచ్చు పాఠశాలల విలీనం పేరుతో టీచర్లను సర్దుబాటు చేసి మిగులు చూపించే పనిలో సర్కారు తలమునకలై ఉంది. కానిస్టేబుళ్ల భర్తీకీ చర్యలు పూజ్యం. అరకొర ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించి వాటిని కూడా ఉద్యోగాల లెక్కలో చూపి ఈ ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోంది. సచివాలయ ఉద్యోగులను నెలకు 15 వేల రూపాయలతో నియమించి వారిని పర్మినెంటు చేసే క్రమంలో చుక్కలు చూపించింది. మొత్తం మీద నిరుద్యోగ నిర్మూలనకు పెద్దగా ఉపక్రమించిన దాఖలాలు లేవు.