డిసెంబర్ 16 నుంచి నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారి ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల సమావేశాలు ఖరారయ్యాయి. ఈ నెల16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలు, జనసైనికులు, వీరమహిళలతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, సూళ్ళూరుపేట నియోజకవర్గ నాయకులు, జనసేన శ్రేణులతో సమావేశాలు ఉంటాయి. 17వ తేదీన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల జనసేన నాయకులు, జనసేన శ్రేణులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై చేయబోయే పోరాటం, తెలుగుదేశం పార్టీతో పొత్తు, సమన్వయం వంటి అంశాలపై జనసేన పార్టీ శ్రేణులతో చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 13,14,15 తేదీలలో శ్రీ నాగబాబు గారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. పార్టీకి సంబంధించి పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు.