బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు, పేదలందరికీ కన్నీళ్లు!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం ఈతకోట గ్రామం నందు శనివారం జన సైనికులు, కార్యకర్తలు నియోజకవర్గం నలుమూలల నుంచి హాజరై, కొత్తపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వంలో బైక్ ర్యాలీగా బయలుదేరి, గోపాలపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో 15 ఎకరాల జగనన్న కాలనీ ఇళ్ల స్థలంలు నిరుపయోగంగా ఉండడం చూసి ఎంతో విచారము వ్యక్తం చేస్తూ, జగనన్న ఇల్లు, పేదవారికి కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకత్వం విజయవంతంగా యాస్ట్రాక్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. అక్కడ జరుగుతున్న కాలనీలో ఇళ్ల స్థలాల్లో ఏ విధమైన డెవలప్మెంట్స్, కానీ ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చిన దాఖలాలు కానీ, కాలనీ ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు కానీ ఏ విధంగానూ లేవని, ఈరోజుకి ఎంతో నీటి లోతులో 15 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నదని, ఈ భూమిలో ఇళ్ల స్థలాలు ఎవరికి కేటాయించారని, స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని నిలదీస్తూ, జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్ జన సైనికులతో కార్యకర్తలతో, ఆ స్థలంలో ఉన్న నీటిలో పడవలను వదులుతూ, నిరసన వ్యక్తం చేస్తూ, వెంటనే పేదలందరికీ ఇళ్లు స్థలాలు స్వాధీనం చేసి, ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న జగనన్న మోసం అనే కార్యక్రమాన్ని యాస్ట్రాక్ జగనన్న మోసం అనే డిజిటల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు కేటాయించాలని, కాలనీ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేయడం జరిగినది. అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఈరోజు వరకు ఇళ్ల స్థలాలు పేదలకు ఎవరికి ఇవ్వలేదని, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కొరకు నామమాత్రంగా పట్టాలు ఇచ్చి, ఓట్లు దండుకుని వేయించుకున్నారని, కానీ ఈరోజు వరకు పూర్తిస్థాయిలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలను మెరక చేసి, నిరుపేద లబ్ధిదారులకు, ఎందుకు అందించలేదని వారికి, ఎందుకు కాలనీ ఇల్లు కట్టించడం లేదని డిమాండ్ చేశారు. ఇది జగనన్న మోసం కాదా! నిరుపేద ప్రజలు, ఇల్లు లేని వారు ఎంత కాలం వేచి చూడాలని, స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సొంత గ్రామంలోని ఇళ్ల స్థలాలను ఈరోజు వరకు పూర్తిస్థాయిలో మెరక చేయించలేదని, ఈరోజు వరకు ఇళ్ల స్థలాలు ఎవరికి కేటాయించకపోవడం ఎంతో దారుణమని, అదేవిధంగా నియోజకవర్గం నలుమూలల గ్రామాలలో ఇళ్ల స్థలాలు ఎవరికి కేటాయించి,ఎవరికి స్వాధీనం చేశారని, వెంటనే స్వాధీనం చేసి, కాలనీఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈతకోట, గోపాలపురం, దేవరపల్లి తదితర గ్రామాల్లో ఉన్న ప్రభుత్వం కొనుగోలు చేసిన జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. నియోజకవర్గం జిల్లా జనసేన కార్యదర్శులతో పాటు, నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యులు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.