జనగనన్న ఇల్లు – పేదల సొంతింటి కలకే కన్నీళ్లు

  • ఎన్నికల హామీగా మిగిలి పోయిన జగనన్న కాలనీలు
  • జగనన్న కాలనీల్లో మౌళిక వసతులు గాలికి, గతంలో నిర్మించిన కాలనీలలోనే అధ్వానంగా ఉన్నా డ్రైనేజి కాలువలు
  • అద్దెలు భరించ లేక అప్పు చేసి కట్టుకుందామన్న అధికారులు అనుమతి ఇవ్వలేదు
  • కొన్ని చోట్ల వర్షం వస్తే నీటితో నిండిపోయే పంట పొలాల్లో స్థలాల పంపిణి
  • మండలో జగనన్న కాలనీలు అట్టర్ ఫ్లాప్
  • గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, పొన్నతోట రామయ్య

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా శనివారంనార్పల మండల కేంద్రంలోని జననన్న కానీలను సన్దరిసంచడం జరిగింది. జగనన్న ఇల్లు పతకం లో భాగంగా నవరత్నాల పేదలందరికీ ఇల్లు అని వైసిపి ప్రభుత్వం భూటకపు హామీలు ఇచ్చి పేదప్రజల ఇంటి ఆశలపై నీళ్లు చల్లందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గంజికుంట రామకృష్ణ తీవ్రస్థాయిలో వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసారు. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లే మిగిల్చిందని యెద్దవా చేసారు. తుపాకుల భాస్కర్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని రెండు విడతలలో దాదాపు 750 పైగా ఇంటి స్థలాలను 450 కి పైగా ఇల్లు మంజూరైన ఇప్పటివరకు ఎక్కడ ఒక్క ఇటుక కూడా వేసింది లేదు అన్నారు. మౌళిక వసతులైన నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజిలో వంటి కనీస సౌకర్యాలను కల్పించడంలో ఘోరంగా ప్రభుత్వం విఫలం చెందిందని, వాటికోసం ఎక్కడ కుడా ఒక్క రూపాయి ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. నివాసానికి కేటాయించిన స్థలాలలో పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలకు నిలయమయ్యాయి. కొందరు లబ్ది దారులతో మాట్లాడగా ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి పట్టా ఇచ్చింది కానీ ఇల్లు కట్టించలేదని అద్దె ఇండ్లలో అద్దె చెల్లించలేక పోతున్నామని, మరికొందరు అప్పు చేసైనా కట్టుకుందామని ప్రయాన్తిసున్న అధికారులు అనుమతులు యివ్వకుండా తస్కరం చేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం నుండి అందించేసహాయం 1.80 లతో ప్రస్తుతం ఉన్న ధరలలో బేస్ మట్టంకి మాత్రమే సరిపోతుందని ప్రభుత్వ సహాయం పెంచాలని డిమాండ్ చేసారు. తక్షణం మీరు లబ్ది దారులకు ఇల్లు కట్టించకపోతే 2024 లో వచ్చేది జనసేన ప్రభుత్వమే అని, మా ప్రభుత్వంలో పట్టాల పంపిణీలో జరిగిన అక్రమాలను, అవకతవకలను సరిచేసి నిజమైన పేద అర్హులకు ఇల్లు కట్టించి జగనన్న కాలనీలను జనసేన కాలనీలుగా నామకరణం చేస్తామని హెచరిన్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులూ గంజికుంట రామకృష్ణ, తుపాకుకు భాస్కర్, పొన్నతోట రామయ్య, ప్రదీప్, వినోదం లోకేష్, గూగూడు శ్రీధర్ బాబు, రాము జనసైనికులు పాల్గొన్నారు.