పవన్ కళ్యాణ్ పై విమర్శించిన మంత్రులపై విరుచుకుపడ్డ చొప్పా చంద్రశేఖర్

అనంతపురం, తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన నిజం కనుమరుగు అవుతుంది అనుకోవడం మీ భ్రమ. మీకు దత్తత గురించి, ప్యాకేజీ గురించి ఎన్నో సార్లు నిరూపించమని మా జనసైనికులు ఛాలెంజ్ వేశారు. చచ్చుమాటలు కట్టి సాక్ష్యం ఉంటే చూపించు సాక్షి. మీరేదో ఊహాగానాలు చేస్తేనో కొంతమంది ఎదో నోటికి వచ్చినట్లు వాగితేనో అది నిజంకాదు. మాట్లాడే వ్యక్తి నిబద్ధత చూడు పర్యటన శాఖ అంటే టక టకా మాట్లాడటం అనుకునే రోజా గతంలో టిడిపిలో ఉన్నప్పుడు వై.ఎస్.ఆర్ ని అమ్మనాబూతులు తిట్టింది. ఐటి శాఖ అంటే ఇతరులను తిట్టడం అనుకునేవాళ్ళకి ఏమీ తెలియదు. నీటి పారుదల శాఖ అంటే ఇష్టమొచ్చినట్లు నోట్లో మాటలను పారించడం అనుకునే వీళ్ళ మాటలకు నిబద్ధత ఉందా..? వీళ్ళ శాఖలపై వీరి అవగాహన ఎంత…? తిట్లపురాణాలు మీ కంటే మాకు కూడా బాగా వస్తాయి కానీ మాకు మా నాయకుడి సంస్కారం మా నోరు మూయిస్తుంది. మీలాగా మేము సంస్కార హీనులం కాదు. మా అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేసింది ప్రజల సమస్యల మీద. వాటికి ఎవరూ సమాధానం చెప్పరు. వ్యక్తి గత దూషణలు చేయటం లేకుంటే ఆ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్.. దత్తత.. ప్యాకేజీ… వీటి కాలం చెల్లింది. ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వారెవరు… తన సంపాదించిన డబ్బులు ప్రజలకు ఇస్తున్నది ఎవరని… అతనికి డబ్బు వ్యామోహం లేదని మీ ప్యాకేజీ మాట అభూత కల్పన అని, ఇక దత్తత అంటారా ఎవరికో దత్తత ఉండవలసిన ఖర్మ మా నాయకుడికి గానీ మాకు గానీ లేదు. ఎందుకంటే మాకు అధికారం ఉంటేనే మనగలగడం మా అవినీతి ఆస్తులను కాపాడుకుంటాము అనే పరిస్థితి లేదు. ఎన్నికలలో కలసి పోటీ చేస్తే దత్తత అంటే గతంలో ఎంతో మంది పొత్తులు పెట్టుకుని ఉన్నారు వారందరూ మీ ఐకాన్ వై.ఎస్.ఆర్ తో సహా మరి వారందరూ దత్తపుత్రులే అని మీ భావన. ఈశ్వరుడు నోరు ఇచ్చారు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే మేము కాదు ఆ దేవుడే మిమ్మల్ని శిక్షించి తీరుతాడు. డబ్బులు ఇచ్చి ట్యూషన్ చెప్పించుకొని మైకుల ముందు మాట్లడే వారికి స్క్రిప్ట్ లు గాక ఏమొస్తాయి. అందరూ అలాగే ఆనుకుంటే ఎలాగ. మా నాయకుడి జోలికొస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు… ఎవరి వాటా వారికిస్తాం…ఖబర్దార్ అంటూ అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ మండిపడ్డారు.