జగన్ పాలన అంతమే అంతిమ లక్ష్యం

ఏలూరు: రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టిడిపి, జనసేన పార్టీల సమన్వ కమిటీ సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్ష వహించారు. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయాలన్నారు. విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేసే చంద్రబాబు నాయుడు, విప్లవాత్మకమైన ఆలోచనతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ ల కలయిక అధికార పార్టీ వైసిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రాన్ని గుండాలు, రౌడీలు, మాఫియాలు, అరాచక శక్తులు పాలిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలదీస్తే ప్రతిపక్ష నాయకులపైన, ప్రజాసంఘాలపై తప్పుడు కేసులు పెట్టించి, జైల్లో నెడుతూ ప్రభుత్వం అణచివేస్తుందన్నారు. టిడిపి, జనసేన పార్టీల అధినాయకత్వం ఆదేశాలను అమలు చేస్తూ.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఏలూరు నగరంలో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయని, కళ్ళుండి చూడలేని స్థితిలో ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఉన్నాడని ధ్వజమెత్తారు. ఏలూరు కార్పొరేషన్ లో అవినీతి రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నాని నియంతలా వ్రవహరిస్తున్నారని ఆరోపించారు. సైకో జగన్ పోవాలన్నదే తమ అజెండా అని స్పష్టం చేశారు. అధికార వైసిపి నాయకులు అక్రమంగా చేర్పించిన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. సమావేశంలో సైకో పోవాలి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రావాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, చోడే వెంకటరత్నం, జనసేన పార్టీ నాయకులు బివి రాఘవయ్య చౌదరి, ఒబ్బిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతి కుమార్ లతోపాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.