వారాహి యాత్ర విజయవంతం కావాలని జనసైనికుల ప్రత్యేక పూజలు

అవనిగడ్డ: వైసీపీ దుష్ట పరిపాలన అంతం కావడం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర పేరుతో ప్రజల లోకి రానున్న నేపథ్యంలో, ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరుతూ అవనిగడ్డ మరియు నాగాయలంక జనసైనికులు నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, నాగాయలంక పుర వీధుల్లో పాదయాత్ర చేశారు. తదనంతరం వందలాది మంది జనసైనికులు బైక్ ర్యాలీతో అవనిగడ్డ చేరుకుని, ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి, సామాన్యుల నడ్డి విరిచిన వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని అన్నారు. రొయ్యల చెరువులకు ఉపయోగించే విద్యుత్ చార్జీలకు సబ్సిడీ ఎత్తివేసి, రైతుల జీవితాలతో ఈ వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం అని చెప్పి, మద్యం మీద వచ్చే ఆదాయం ను చూపించి, అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపే జగన్ మోహన్ రెడ్డి గారు మాట తప్పను, మడం తిప్పను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనవరి 1వ తేదీన విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదని తూర్పార బట్టారు. సాగు నీరు అందక గడిచిన మూడు సంవత్సరాల కాలం నుండి కోడూరు మండలం బసవవానిపాలెం గ్రామ రైతులు స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటించారు అంటే, దీనికి నైతిక బాధ్యత వహించి, స్థానిక శాసనసభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ బొప్పన భాను మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు నిజాయతీ గురించి ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారని, ఆయనకు అధికారం ఇస్తే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని, జగన్ మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని చేపట్టే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ను మనం అందరం విజయవంతం చేసుకుందాం అని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు రేమాల మురళి మాట్లాడుతూ.. ఈ నియంత ప్రభుత్వం పోవాలని, జనరంజక ప్రభుత్వం ఏర్పడాలని ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించారని, ఈ యాత్రను విజయవంతం చేసుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి గాజుల శంకరరావు, సంయుక్త కార్యదర్శి పద్యాల వెంకట ప్రసాద్, ఎంపీటీసీ బాప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, అశ్వారావు పాలెం ఉప సర్పంచ్ యక్కటి నాగరాజు, లేబాక అంకాలరావు, వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ, భోగిరెడ్డి నాగేశ్వరరావు, గౌస్ కాటమ, గుగ్గిలం అనీల్, చోడిశెట్టి రాఘవ, బొంతు ప్రకాష్, సనకా శేషు, మిరియాల సురేష్, ముమ్మారెడ్డి సురేష్, గుడివాక రామాంజనేయులు, మెకానిక్ కొండలు మిత్రబృందం, తుంగల చరణ్, చోడిశెట్టి శ్రీనివాసరావు, యర్రంశెట్టి నాగ పవన్ మిత్ర బృందం, గుడివాక మారుతి, నాగిన్, సుధీర్ మిత్ర బృందం, భాను, తుంగల వేణు, బచ్చు మురళి, కమ్మిలి గోపాలరావు, చుండూరు రమేష్, దాసినేని నాగరాజు, మాదివాడ అనీల్, బచ్చు ప్రశాంత్, బొప్పన పృధ్వీ, తోట ఆంజనేయులు, భోగిరెడ్డి బాలాజీ, పసుపులేటి శ్రీను మిత్ర బృందం, బాల భాస్కర్, గంగు అర్జున్, తుంగల సాయి, గరికిపాటి నవీన్, మండలి ఉదయ్, గరికిపాటి శ్రీను, తుంగల నరేష్, కోసూరి అవినాష్, పప్పుశెట్టి శ్రీను, కమ్మిలి వేణు, కమ్మిలి రఘు రత్న ప్రసాద్, షేక్ ఫరీద్, రేపల్లె లక్ష్మణ, యక్కటి రంగనాథ్, అపికట్ల శ్రీ భాస్కర్, రేపల్లె రోహిత్, పోతన నాగరాజు, బత్తుల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.