వీధిలైట్లు మరియు సిమెంట్ రోడ్డు వేయాలని జనసేన వినతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు, చిన్నగంజాం మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఇంటింటికి జనసేన అనే కార్యక్రమంలో చిన్నగంజాం గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రభుదేవా కాలనీకి చెందిన కొంతమంది మహిళలు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు జనసేన నాయకుల దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఆ సమస్యల్లో భాగంగా మంగళవారం ఆ గ్రామానికి వీధిలైట్లు మరియు సిమెంట్ రోడ్డు వేయాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సందు శ్రీనివాసరావు గ్రామ కార్యదర్శి మస్తాన్ రావు మరియు సర్పంచ్ ఆత్మనందరావులకు వివరించి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కుర్రి వాసుదేవరావు, అడుసుమల్లి హరిబాబు, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ తుమ్మలపెంట సతీష్. యువ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, గంటా వెంకటేష్, చెరుకూరి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.