ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ జనసేనానిపై చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్..

నందిగామ నియోజకవర్గం: ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గురువారం మంత్రి రోజాని వెనకేసుకు వస్తూ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కాయ్ రాజా కాయ్ అని అధికార గర్వంతో అత్యంత హేయంగా మాట్లాడడం వారి దర్పానికి నిదర్శనమని జనసేన నేతలు ఫైర్ అయ్యారు. నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం మీ అన్నగారు కూడా ఒక సారి ఓటమి చెందిన వారే కదా.. మంత్రి రోజా కూడా రెండు మార్లు ఓడిన చరిత్ర మీకు కనిపించకపోవడం దురదృష్టం.. మీ పార్టీ అధ్యక్షుడి తల్లి విశాఖలో లక్ష ఓట్ల తేడాతో ఓడిన చరిత్ర మరిచారా?.. ప్రస్తుత మంత్రి రోజా గతంలో ఓ ధర్నా నిర్వహిస్తూ మేమేమీ ఎస్సీ ఎస్టీ లము కాదులే దూరంగా ఉండనవసరం లేదని అగ్ర కుల అహంకారం చూపిన ఘట్టం మీరు మరిచారా?, ఆమె కూడా రెండు మార్లు దేశం పార్టీలో ఓడి చంద్రగిరి నుండి నగరి పోయి జగన్ పార్టీ పంచన జేరి ఓట్లకు కోట్లు కుమ్మరించి గెలిచినది ప్రజలకు తెలియనిదా? ఇప్పుడు ఆమె మీకు అంత ప్రియమైన వ్యక్తి అయ్యిందా?. మా పార్టీ బహుజన రాజ్యాధికార సిద్ధాంతానికి కట్టుబడి 2019 లో బీఎస్పీ కి టికెట్ కేటాయించడం వల్లనే మీరు గెలిచి బయటపడ్డ విషయం మరిచారా?. సిద్ధాంత పరంగా మాట్లాడాలని వ్యక్తి గతంగా విమర్శించడం శ్రీ రంగ నీతులు మీరు చెప్పాల్సిన అవసరం లేదు…అసలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా భార్యల గూర్చి మాట్లాడి వారిని కార్లతో పోల్చి విమర్శలకు తెరలేపింది మీ నాయకుడు కాదా?. సిద్ధాంతాల గూర్చి మాట్లాడుతున్నారు అసలు మీ పార్టీ మూల సిద్ధాంతం ఏమిటో తెలిపితే సంతోషిస్తాం.. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతక సేకరణ చేసిన ఉదంతం మర్చిపోయారా?, అధికారమే పరమావధిగా దానికోసం ఎంతటి పాపాలకైన ఓడిగట్టే ముఠా సంస్కృతి ఉన్న పార్టీ లో ఉండి లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని 16 నెలెలు జైల్లో ఉన్న వ్యక్తినీ వెనకబెట్టుకుని సిద్ధాంతాల గూర్చి మాట్లాడడం శోచనీయం. నందిగామ నవ నిర్మాతలను అని చెప్పుకుంటున్న మీకు కొన్ని ప్రశ్నలు.. ప్రభుత్వ ఆసుపత్రి లో ఎమర్జెన్సీ ట్రామా కేర్ పెట్టించే దమ్ము మీకుందా? గర్భిణీ స్త్రీలు వచ్చే ఓఫ్ కి డెలివరీ కౌంట్ కి వ్యత్యాసం మీకు తెలుసా? గైనిక్ డాక్టర్లు ప్రయివేటు ప్రాక్టీసు చేసుకుంటుంటే మీరేమో చోద్యం చూస్తున్నారు. కేంద్రీయ విద్యాలయమునకు కోటి పాతిక లక్షలు ప్రజాధనం మట్టిలో పోశారు. 100 పడకల ఆసుపత్రి వస్తుందని ఊదరగొట్టిన మీరు ఆ ప్రపోజల్ నీ రాష్ట్ర ముఖ్యమంత్రి తుంగలో తొక్కితే నందిగామ జనానికి మాట మాత్రం కూడా చెప్పలేదు. సుబాబుల్ రైతులకు 5000 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని పలికిన నాటి బీరాలు నేడు అధికారం లోకి వచ్చాక ఎమైనయో?. వీర్లపాడు మండలం లో త్రాగునీటి ఎద్దడి పట్టించుకున్న పాపాన పోలేదు. మున్సిపాలిటీ కి వేలకు వెలు పన్నులు చెల్లించి కూడా రోజు నిత్యం కొన్ని వందల మంది నీళ్ళ డబ్బాలు పట్టుకుని నందిగామ పట్టణం లో నీళ్ళ టాంకీల వద్ద బారులు తీరుతున్నారు మీకు పట్టణంలో త్రాగు నీటి కటకటలు తెలియకపోవడం శోచనీయం. కంచికచర్ల ప్రభుత్వ కళాశాల దుస్థితి, ఈ ఎస్సై డిస్పెన్సరీ మూసివేత, చందర్లపాడు మండలంలో మిర్చి రైతులు గత సంవత్సర పంట నష్ట పోతే వారిని పట్టించున్న నాథుడే లేడు. నియోజకవర్గంలో సంవత్సరానికి 6 వేల మంది ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ బయటికి వస్తుంటే పట్టుమని 10 వేల రూపాయలు ఉద్యోగం కూడా కల్పించలేని నిరుద్యోగ విలయ తాండవం మీకు కనిపించకపోవడం దురదృష్టం. 15 వ ఆర్థిక సంఘం నిధులు నందిగామకు వస్తె ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూడవలసిన పాలక హోదాలో ఉన్న మీరు 20 వార్డులకు సమానంగా పంచవలసినది పోయి కేవలం ఒక్క సీఎం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు పోసి సుందరీకరణ చేశారు మీ గృహం ఆ రోడ్డు లో ఉందని చేశారా లేక రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా చేశారా?. అనాసాగరం, హరిజనవాడలలో మీకు గంప గుత్త గా ఒట్లేసిన జనాలకు మొండి చెయ్యి చూపించిన ఉదంతం నిజం కాదా?. వసూలు రాజాలు, కాయ్ రాజా కాయ్ లు ఎవరో నియోజకవర్గ ప్రజలు ధారాళంగా చెప్పుకుంటున్నారు. పట్టణం లో తట్ట బుట్ట ల వద్ద కూడా ఆశీలు వసూలు చేస్తుంటే జనం ఖాండ్రి ఊసార లేదా? టీటీడీ దర్శన సిఫారసు లేఖలు కూడా వసూళ్లు చేశారని..పవిత్ర దేవాలయాలు, చర్చిలు ఉన్న కొండలు అప్పుడు తెలుగు దేశం, ఇప్పుడు మీరు చెరొక కొండ పంచుకుని దోచుకున్నారని, ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల బిల్లుల లో వాటాలు అడుగుతున్నారని జనం అనుకుంటున్న ఆరోపణల మీద శ్వేత పత్రం విడుదల చేయగలరా?. గతంలో కూడా మీరు పలు మార్లు మా పార్టీ అధ్యక్షుడి పట్ల అనుచితంగా మాట్లాడారు పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం మేము స్పందించలేదు కానీ ఇక మాలో ఓర్పు నశించింది. ఖచ్చితంగా మా పార్టీ మీకు అనాసాగరం లో చూపించిన రుచి ఈ సారి నియోజకవర్గ వ్యాప్తంగా చూపించబోతున్నం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి అరుణ్ కుమార్ గారు 2024 ఎన్నికల విధి విధానాలలో పొత్తు అంశంలో మా అధ్యక్షుల వారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ప్రకటించబడితే నందిగామ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్ధి భారీ మెజారిటీతో గెలిపిస్తాం. లేకపోతే మొదటి రెండు స్థానాలలో మేము ఒక స్థానం పొందుతాం మిమ్మల్ని మాత్రం మూడో స్థానానికి పంపే భాధ్యత జనసేన తీసుకుంటుందని జనసేన నాయకులు తెలియజేసారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ నాయకులు కామిసెట్టి వెంకటేశ్వర రావు, పూజారి రాజేష్, 20 వ వార్డు కౌన్సిలర్ తాటి వేంకట కృష్ణ పట్టణ పార్టీ అధ్యక్షులు శివ కృష్ణ, కార్యదర్శి తానూరి సైదెస్వర్, రాజేష్ కుమ్మరి, హనుమంతు, నాని, శ్రీనివాసరావు పలువురు కార్యకర్తలు హాజరైనారు.