పిఠాపురం పట్టణం 2వ వార్డులో పర్యటించిన జనసేన నాయకులు

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు చెల్లుబోయిన సతీష్, పిఠాపురం పట్టణం 2వ వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి వేల్పుల చక్రధరరావు అధ్యర్యంలో పిఠాపురం పట్టణం ప్రజాసమస్యల పరిష్కారం కార్యక్రమంలో భాగంగా పట్టణ 2వ వార్డు నందు పర్యటించడం జరిగింది. స్థానిక శ్రీపాద శ్రీ వల్లభ అనఘా క్షేత్రం నందు పూజాకార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయం సాధించాలి అని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా విజయం సాధించాలి అని పూజారులు ఆశీస్సులు అందించడం జరిగింది. శ్రీ పాద శ్రీ వల్లభ అనఘా దత్త క్షేత్రం వెనుక గల లే అవుట్ట్ నందు మురికి నీరు డ్రైనేజీ మూసుకొని పోవడం వలన, వార్డు నందు గల భద్రాచలం వీధి, కుమ్మరి వీధి, నెంబర్ 2 సచివాలయం వీధి,మోటూరి వారి వీధి, గండు వారి వీధి, మేడిది వారి వీధి, చల్లావారి వీధి, బిందుల వీధి, పశువుల రోడ్డులోకి బ్యాక్ వాటర్ మళ్ళీ వెనక్కి వెళ్లి పారిశుధ్య, డ్రైనేజి చెత్త వలన, పందులు నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉన్నాయి. తద్వారా దోమలు వలన ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్, ఒళ్ళు నొప్పులు, వైరల్ జ్వరాలతో రోగాలతో ఉన్నారు. కావున మున్సిపాలిటీ అధికారులు, సచివాలయం సిబ్బంది, ఎమ్మెల్యే, ఎంపీ పరిశీలించి డ్రైనేజి నీరు, మురికి చెత్త శుభ్రం చేసి, పందుల నుండి ప్రజల ఆరోగ్యం కాపాడాలి అని జనసేన పార్టీ తరుపున విన్నపం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి పల్నాటి మధు బాబు, పుణ్యమంతుల గణేష్, బత్తిన రామకృష్ణ, చీకట్ల సత్య నారాయణ, అలుగోలు చిన్న, పిట్టా చిన్న, పసుపులేటి గణేష్, రెడ్డి మనోహర్, చోడిశెట్టి రాజా, బెల్లంకొండ రవి మరియు జనసైనికులు పాల్గొన్నారు.